Puvvada Ajay Kumar: పోలవరం డ్యామ్ తో తెలంగాణకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే: తెలంగాణ రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్

  • పోలవరం వల్ల ఎన్నో గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయన్న మంత్రి 
  • గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్తోందని వెల్లడి 
  • డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్న అజయ్ 
Telangana facing problems with Polavaram dam says Puvvada ajay Kumar

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందనే మాట వాస్తవమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపు బారిన పడుతున్నాయని చెప్పారు. ఈ డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్తోందని అన్నారు. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. భద్రాచలం పట్టణానికి వరద నుంచి శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1,000 కోట్ల రూపాయలను ప్రకటించారని తెలిపారు. 

ముఖ్యమంత్రి ఆకాశ మార్గాన కాకుండా రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిశారని చెప్పారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తామని... వారికి శాశ్వత గృహాలను కట్టిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని చెప్పారు.

More Telugu News