Saitej: సాయితేజ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ!

Kethika Sharma in Pavan movie

  • అందాల భామగా ఆకట్టుకుంటున్న కేతిక 
  • నిరాశ పరిచిన తొలి రెండు సినిమాలు
  • త్వరలో థియేటర్లకు రానున్న 'రంగ రంగ వైభవంగా'
  • సముద్రఖని రీమేక్ లోను లభించిన ఛాన్స్

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై భారీ అందాల భామగా కేతిక శర్మ మార్కులు కొట్టేసింది. అందాలు ఆరబోయడానికి ఎంతమాత్రం మొహమాటపడని ఈ ముద్దుగుమ్మకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన 'రొమాంటిక్' .. 'లక్ష్య' రెండు సినిమాలు పరాజయంపాలైనా క్రేజు .. డిమాండు ఎంతమాత్రం తగ్గలేదు. 

కేతిక మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగ రంగ వైభవంగా' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముందే ఆమె సాయితేజ్ సరసన నాయికగా ఛాన్స్ కొట్టేయడం విశేషం. సక్సెస్ లు లేకపోయినా గ్లామర్ తో వరుస అవకాశాలు పట్టేస్తుందని చెప్పుకుంటున్నారు. 

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సముద్రఖని 'వినోదయా సితం' రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. సినిమా మొత్తం ఉండే ఆయన సరసన కథానాయికగా కేతిక శర్మను తీసుకున్నారని అంటున్నారు. ఇంతకుముందే ఆమె పేరు వినిపించింది .. ఇప్పుడు ఆమెనే ఖరారు చేశారన్నమాట.

Saitej
Kethika Sharma
Samudrakhani
  • Loading...

More Telugu News