WhatsApp: వాట్సాప్ లో సందేశాలను తొలగించుకునేందుకు మరింత సమయం

WhatsApp may give users more time to delete their messages after sending them

  • ప్రస్తుతం 1 గంట 8 నిమిషాల పాటే
  • రెండు రోజుల వరకు అవకాశం ఇవ్వనున్న వాట్సాప్
  • ప్రస్తుతం ఐవోఎస్ వెర్షన్ పై పరీక్ష

వాట్సాప్ లో  ఒకరికి పంపించిన సందేశాలను తిరిగి తొలగించుకునే (డిలీట్) అవకాశం ఉంటుంది. కానీ, దీనికి సమయం పరిమితి ఉంది. కొంత సమయం తర్వాత దాన్ని తీసేయాలని అనిపించొచ్చు. అప్పటికే సమయం మించి పోయిందంటే? ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఈ సమయాన్ని మరింత అధికంగా ఇవ్వాలని వాట్సాప్ భావిస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యం వినియోగదారులకు అమల్లోకి రానుంది. 

ప్రస్తుతం ఒక సందేశం పంపిన తర్వాత గంట 1 గంట 8 నిమిషాల, 16 సెకండ్ల వరకు డిలీట్ చేయవచ్చు. అయితే పంపించిన రెండు రోజుల తర్వాత కూడా వాటిని తొలగించుకునే ఆప్షన్ ఇవ్వాలని వాట్సాప్ ప్రణాళికతో ఉంది. ఐవోఎస్ వెర్షన్ వాట్సాప్ పై ఈ ఫీచర్ ను ప్రస్తుతం పరీక్షించి చూస్తోంది. అలాగే, గ్రూప్ లో సభ్యులు పోస్ట్ చేసిన వాటిని అడ్మిన్ లు శాశ్వతంగా డిలీట్ చేసే ఆప్షన్ ను సైతం వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. 

WhatsApp
Messages
deletion
more time
  • Loading...

More Telugu News