బక్రీద్... ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినం: పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys Bakrid wishes
  • జులై 10న బక్రీద్ పండుగ 
  • ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • జీవిత సత్యాలను తెలిపే పండుగ అని వెల్లడి
రేపు (జులై 10) బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగం, సత్యం విలువను చాటుతుందని పేర్కొన్నారు. ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పర్వదినం అని వివరించారు. ఈ పండుగ జీవిత సత్యాలను తెలియజేస్తుందని వెల్లడించారు. 

మనిషి తన జీవన గమనంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని తట్టుకుంటూ సత్యం కోసం స్థిరంగా నిలబడి, అందుకోసం అవసరమైతే త్యాగానికి సిద్ధపడినప్పుడే సత్ఫలితాలు అందుతాయని బక్రీద్ పండుగ నేపథ్యం ద్వారా తెలుస్తుందని పవన్ కల్యాణ్ వివరించారు. ఇస్లాంను విశ్వసించే ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పక్షాన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Bakrid
Wishes
Janasena
Andhra Pradesh

More Telugu News