Nagababu: ముద్దుల మామయ్య అమ్మ ఒడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?: నాగబాబు విమర్శలు

  • ఇటీవల ముద్దుల మామయ్య అంటూ సంబోధించిన పవన్
  • ఏపీలో పెద్ద సంఖ్యలో స్కూళ్ల మూసివేత
  • తాజాగా ముద్దుల మామయ్యా అంటూ నాగబాబు వ్యాఖ్యలు 
Nagababu criticizes CM Jagan

ముద్దుల మామయ్య విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడం లేదంటూ ఇటీవల సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు కూడా ముద్దుల మామయ్య అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

'ఏపీలోని దాదాపు 8 వేల స్కూళ్లను మూసివేయడం ద్వారా ముద్దుల మామయ్య అమ్మ ఒడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?' అని నిలదీశారు. లేక, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడానికా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 పాఠశాలలను మూసివేసిన వైసీపీ సర్కారు అక్కడున్న చిన్నారుల భవిష్యత్తును ఏం చేయాలనుకుంటోంది అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News