YSRTP: కొడుకుతో కలిసి తండ్రికి వైఎస్ షర్మిల నివాళి!... వైఎస్సార్ మ‌న‌వ‌డి ఫొటో ఇదిగో!

ys sharmila son raja reddy special attraction in ysr jayanthi

  • త‌ల్లి ష‌ర్మిలతో క‌లిసి తాత‌కు రాజారెడ్డి నివాళి
  • ఇడుపుల‌పాయ‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన వైఎస్సార్ మన‌వ‌డు
  • హైద‌రాబాద్‌లో రాజారెడ్డిని చూసేందుకు ఎగ‌బ‌డ్డ వైఎస్సార్టీపీ శ్రేణులు

నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ‌యంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయ‌న కూతురు, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కుమారుడు రాజా రెడ్డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌ల్లి వెంట గురువారం సాయంత్ర‌మే ఇడుపుల‌పాయ చేరుకున్న రాజా రెడ్డి... శుక్ర‌వారం ఉద‌యం త‌ల్లి, చెల్లితో క‌లిసి వైఎస్సార్ ఘాట్‌లో తాత‌కు నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా త‌ల్లి వెంటే సాగుతున్న ఆయ‌న ఫొటోలు వైఎస్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. 

వైఎస్సార్ ఘాట్‌లో కార్య‌క్ర‌మాన్ని ముగించుకున్న అనంత‌రం ష‌ర్మిల త‌న పిల్ల‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకున్నారు. అనంతరం పంజాగుట్ట‌లోని వైఎస్సార్ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి ఆమె త‌న తండ్రికి నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా కూడా త‌ల్లి వెంటే తాత విగ్ర‌హం వ‌ద్ద‌కు వ‌చ్చిన రాజా రెడ్డి వైఎస్సార్టీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ష‌ర్మిల త‌న‌యుడిని చూసేందుకు పార్టీ శ్రేణులు అమితాస‌క్తి క‌న‌బ‌ర‌చారు.

YSRTP
YS Sharmila
YS Rajasekhar Reddy
Telangana
YS Raja Reddy
  • Loading...

More Telugu News