YSRCP: రేపు క‌ర్నూలు టూర్‌కు ముఖ్యమంత్రి... 'జ‌గ‌న‌న్న విద్యా దీవెన' నిధులు విడుద‌ల చేయ‌నున్న ఏపీ సీఎం

ap cm ys jagan toru in kurnool district tomorrow

  • ఆదోనిలో జ‌గ‌న‌న్న విద్యా కానుక నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం
  • గ‌న్న‌వ‌రం నుంచి ప్ర‌త్యేక విమానంలో ఓర్వ‌క‌ల్లుకు జ‌గ‌న్‌
  • అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో ఆదోని వెళ్ల‌నున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. జిల్లా ప‌రిధిలోని ఆదోనికి వెళ్ల‌నున్న జ‌గ‌న్‌...అక్క‌డ జ‌గ‌న‌న్న విద్యా కానుక నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు జ‌గన్ క‌ర్నూలు జిల్లా టూర్ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఖరారు చేసింది.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం నుంచి క‌ర్నూలు న‌గ‌ర స‌మీపంలోని ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో ఆదోని వెళతారు. జ‌గ‌న‌న్న విద్యా కానుక నిధుల‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత తిరిగి హెలికాప్ట‌ర్‌లో ఆదోని నుంచి ఓర్వ‌క‌ల్లు విమానాశ్ర‌యం చేర‌నున్న జ‌గ‌న్ అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం చేరుకుంటారు.

YSRCP
YS Jagan
Kurnool District
Adoni
Jaganna Vidya deevena
  • Loading...

More Telugu News