Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 19 మంది దుర్మరణం

19 dead in pakistan after bus fell into gorge

  • ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు
  • ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • ప్రమాదంపై ప్రధాని షాబాజ్ తీవ్ర దిగ్భ్రాంతి

పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 30 మంది ప్రయాణికులతో రాజధాని ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు మరికాసేపట్లో గమ్యం చేరుకుంటుందనగా అదుపు తప్పి లోయలో పడింది. ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 11 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతి వేగం, భారీ వర్షమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Pakistan
Islamabad
Quetta
Road Accident
  • Loading...

More Telugu News