Khushbu: హైదరాబాదులో ఎక్కడ చూసినా మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లే... కేసీఆర్ భయపడుతున్నట్టుంది: ఖుష్బూ

Khushbu attends BJP national plenary

  • హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • హాజరైన ఖుష్బూ
  • హైదరాబాదులో మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రచారం
  • మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదన్న ఖుష్బూ

హైదరాబాదు వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు షురూ కాగా, తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా, హైదరాబాదులో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పట్ల ఖుష్బూ విస్మయం వ్యక్తం చేశారు. 

నగరంలో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారని... దీన్నిబట్టి మోదీ అంటే కేసీఆర్ కు భయం అన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. మూడోసారి కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లకపోవడం చూస్తుంటే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీనే అని ఖుష్బూ ఉద్ఘాటించారు.

Khushbu
BJP
Hyderabad
Narendra Modi
KCR
  • Loading...

More Telugu News