KCR: ఒకే వాహనంలో జలవిహార్ కు బయల్దేరిన కేసీఆర్, యశ్వంత్ సిన్హా

KCR and Yashwant Sinha leaves to Jalavihar in one vehicle

  • బేగంపేట విమానాశ్రయంలో సిన్హాకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్
  • భారీ ర్యాలీగా జలవిహార్ కు పయనమైన కేసీఆర్, సిన్హా
  • వేలాది బైక్ లతో కొనసాగుతున్న ర్యాలీ

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గాడ్, పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా ఎయిర్ పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు బయల్దేరారు. 

కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఒకే వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్క ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వీరు జలవిహార్ కు వెళ్తున్నారు. వీరి కాన్వాయ్ కు ముందు బైక్ ర్యాలీ కొనసాగుతోంది. వేలాది బైక్ లు ముందుకు సాగుతుండగా కేసీఆర్ కాన్వాయ్ వారిని అనుసరిస్తోంది. రోడ్డు మొత్తం టీఆర్ఎస్ జెండాలతో గులాబీమయంగా మారింది. 

KCR
TRS
Yashwant Sinha
  • Loading...

More Telugu News