Bill Gates: మహేశ్ బాబా మజాకా... సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ను ఫాలో అవుతున్న బిల్ గేట్స్

Bill Gates follows Mahesh Babu in Instagram and Twitter

  • ఇటీవల న్యూయార్క్ లో పర్యటించిన మహేశ్ బాబు
  • బిల్ గేట్స్ తో భేటీ అయినా వైనం 
  • మహేశ్ బాబును మెచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
  • ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో అనుసరణ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ సంపన్నుడు బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్షల కోట్ల విలువ చేసే ఐటీ వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన బిల్ గేట్స్ తనకున్న సంపద ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ప్రాపకం కోసం దేశాధినేతలే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి బిజీ బిల్ గేట్స్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ లో కలిశారు. ఈ సందర్భంగా వారు గేట్స్ తో ఓ ఫొటో కూడా దిగారు. 

మహేశ్ బాబు ఎంతో వినయవిధేయతలున్న వ్యక్తి, పైగా నిరాడంబరుడు. ఇంకేముంది... బిల్ గేట్స్ కు యమాగా నచ్చేశాడు. సోషల్ మీడియాలో చాలా తక్కువ మందిని ఫాలో అయ్యే ఈ ఐటీ దిగ్గజం ఇప్పుడు మహేశ్ బాబును అనుసరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోనూ, ట్విట్టర్ లోనూ మహేశ్ ను ఫాలో అవుతున్నారు. ఇక మహేశ్ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. తమ స్పందనలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు.

Bill Gates
Mahesh Babu
Instagram
Twitter
Social Media
  • Loading...

More Telugu News