Tollywood: మీనా తన భర్తను కాపాడుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించింది: కొరియోగ్రాఫర్ కళా మాస్టర్

actress meena tried to save her husband life till last moment

  • విద్యాసాగర్ జనవరిలోనే కరోనా నుంచి కోలుకున్నారన్న కొరియోగ్రాఫర్
  • అంతకంటే ముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ సోకిందన్న కళా మాస్టర్
  • ఏప్రిల్‌లో విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందని వెల్లడి

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకుండా పోయిందని ప్రముఖ కొరియాగ్రాఫర్ కళా మాస్టర్ అన్నారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ బుధవారం మృతి చెందారు. 

విద్యాసాగర్ కరోనా బారినపడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్యులు చెప్పారని కళా మాస్టర్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయన కరోనా నుంచి కోలుకున్నారని, మీనా తల్లి పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఫిబ్రవరిలో తాము కలుసుకున్నామని అన్నారు. అప్పుడాయన ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. ఆ తర్వాత నెలకే ఆయన ఆరోగ్యం బాగా లేదని మీనా తనకు ఫోన్ చేసి చెప్పారని, తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లి పలకరించానని పేర్కొన్నారు.

విద్యాసాగర్ ఆరోగ్యం ఏప్రిల్‌లో బాగా క్షీణించిందని, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్‌ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని అన్నారు. చిన్న వయసులోనే మీనా తన భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tollywood
Meena
Actor
Vidyasagar
Kala Master
Choreographer
  • Loading...

More Telugu News