actor Meena: మీనా భర్త మృతి పట్ల వెంకటేశ్, శరత్ కుమార్, ఖుష్బూ సంతాపం

Tamil actor Meena husband Vidyasagar dies Sarath Kumar Venkatesh Khushbu Sundar pay tributes

  • షాక్ కు గురి చేసిందంటూ ట్వీట్
  • గుండె ధైర్యం చేసుకోవాలన్న వెంకటేశ్ 
  • జీవితం క్రూరమైందన్న ఖుష్బూ
  • బాధను వ్యక్తం చేయడానికి పదాలు రావడం లేదంటూ ట్వీట్

ప్రముఖ నటి మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు వెంకటేశ్, శరత్ కుమార్, ఖష్బూ సంతాపం వ్యక్తం చేశారు. తీవ్ర శ్వాసకోస ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ విద్యాసాగర్ చెన్నైలో మరణించడం తెలిసిందే. 

మీనా భర్త విద్యా సాగర్ మృతి పట్ల ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘‘ఎంతో బాధాకరం. విద్యాసాగర్ గారి మరణం షాక్ కు గురి చేసింది. మీనా గారికి నా హృదయ పూర్వక సంతాపం. ఈ పరిస్థితుల నుంచి వారు ధైర్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ పేర్కొన్నారు. గతంలో పలు సినిమాల్లో నటించిన వీరిద్దరూ చివరిగా 'దృశ్యం' సినిమాలో కలసి నటించారు. 

మరో నటుడు శరత్ కుమార్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘‘మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణం వార్త షాక్ గురి చేసింది. మీనా, వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారికి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని పేర్కొన్నారు. 

సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సైతం ట్విట్టర్లో స్పందించారు. ‘‘భయంకరమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త, విద్యాసాగర్ మనతో ఇంక ఎంత మాత్రం లేరన్నది గుండెను కలచివేస్తోంది. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన చాలా కాలంగా పోరాడుతున్నారు. జీవితం క్రూరమైనది. బాధను వ్యక్తం చేయడానికి పదాలు రావడం లేదు వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

actor Meena
Vidyasagar
dies
Sarath Kumar
Venkatesh
Khushbu
  • Loading...

More Telugu News