Nadendla Manohar: ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ వాళ్లు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం: నాదెండ్ల

Nadendla condemns attack on BJP leaders in Dharmavaram

  • ధర్మవరం ప్రెస్ క్లబ్ లో ఘటన
  • అందరూ చూస్తుండగానే దాడి జరిగిందన్న నాదెండ్ల
  • ప్రతి ఒక్కరు గర్హించాలని పిలుపు
  • పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధర్మవరంలో బీజేపీ నేతలపై వైసీపీ వాళ్ల దాడి అధికార పార్టీ దౌర్జన్యాలను వెల్లడిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రెస్ క్లబ్ లో అందరూ చూస్తుండగానే దాడికి తెగబడ్డారంటే దాష్టీకాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్షించాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృత్తి కలిగిన నాయకులు పేట్రేగిపోతారని స్పష్టం చేశారు.

Nadendla Manohar
BJP Leaders
YSRCP
Attack
Dharmavaram
Sri Sathyasai District
  • Loading...

More Telugu News