Kotamreddy Sridhar Reddy: బాలినేని తరహాలోనే నేను కూడా ఇంటిపోరు ఎదుర్కొంటున్నా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Iam also facing same issues like Balineni says Kotamreddy Sridhar Reddy

  • కొందరు వైసీపీ నేతలు నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు
  • నా నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు
  • ఇలాంటి పనులు పార్టీకి మేలు చేయవు

సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీతో కలిసి వైసీపీకి చెందిన కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని... ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... బాలినేని తరహాలోనే తాను కూడా ఇంటిపోరును ఎదుర్కొంటున్నానని అన్నారు. జిల్లాకు చెందిన కొందరు వైసీపీ ముఖ్యనేతలు తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

బాలినేని మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారని... అలాంటి వ్యక్తికి స్థానిక నేతలు అండగా ఉండాలే కానీ, అడ్డంకిగా మారకూడదని కోటంరెడ్డి అన్నారు. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కొందరు ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో ఎలా గెలవాలో ఆలోచించకుండా... ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి పనులు పార్టీకి ఏమాత్రం మేలు చేయవని చెప్పారు.

Kotamreddy Sridhar Reddy
Balineni Srinivasa Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News