Telangana: తమిళిసై, కేసీఆర్ భేటీ ఫొటోపై తీన్మార్ మల్లన్న సెటైర్!... వైరల్‌గా మారిన ట్వీట్!

- హైకోర్టు సీజేగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం
- రాజ్‌భవన్‌లో భుయాన్‌తో ప్రమాణం చేయించిన తమిళిసై
- వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్
- తేనీటి విందు ఫొటోపై తీన్మార్ మల్లన్న సెటైరిక్ ట్వీట్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్‌తో మంగళవారం తమిళిసై రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన కార్యక్రమానికి సీఎం హోదాలో కేసీఆర్ కూడా హాజరయ్యారు. సీజే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తేనీటి విందులో తమిళిసై, కేసీఆర్, ఉజ్జల్ భుయాన్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోపై క్యూ న్యూస్ నెట్‌వర్క్ యజమాని తీన్మార్ మల్లన్న సెటైరిక్ ట్వీట్ సంధించారు. తమిళిసై, కేసీఆర్‌ల మధ్య గ్యాప్ ఉందని తెలుసు కాని మరీ ఇంత అని తెలియదు అంటూ ఆ ఫొటోకు తన కామెంట్‌ను జోడించారు. ఫొటోలో సీజే, గవర్నర్‌లు ఎదురెదురుగా కాస్తంత దగ్గరగానే కూర్చున్నా.. వారిద్దిరికి మధ్యలోనే అల్లంత దూరాన కేసీఆర్ కూర్చున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తీన్మార్ మల్లన్న సెటైర్ సంధించారు.
