Rahul Gandhi: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్... మండిపడిన రాహుల్ గాంధీ

Rahul Gandhi reacts to Mohammed Zubair arrest

  • ఢిల్లీ పోలీసుల అదుపులో ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు
  • మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ అరెస్ట్
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • ఒక గొంతుకను అరెస్ట్ చేస్తే వెయ్యి గొంతుకలు లేస్తాయన్న రాహుల్

ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ 'ఆల్ట్ న్యూస్' సహ వ్యవస్థాపకుడు, పాత్రికేయుడు మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ వెళ్లగక్కే ద్వేషాన్ని, మతోన్మాదాన్ని, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తి వారికి ముప్పేనని విమర్శించారు. సత్యాన్ని చాటే ఒక గొంతుకను నిర్బంధిస్తే, అలాంటివి వెయ్యికి పైగా గొంతుకలు ఎలుగెత్తుతాయని పేర్కొన్నారు. నిరంకుశత్వంపై సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా, మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జుబైర్ పై 153, 295ఏ సెక్షన్లు మోపారు.

Rahul Gandhi
Mohammed Zubair
Arrest
Alt News
Fact Check
  • Loading...

More Telugu News