YSRCP: పిడుగురాళ్ల ఎంపీపీ ప‌ద‌వికి వైసీపీ మ‌హిళా నేత‌ రాజీనామా!... కార‌ణ‌మిదేన‌ట‌!

ysrcp leader ramanamma resigns to piduguralla mpp post

  • క‌రాల‌పాడు ఎంపీటీసీగా గెలిచిన ర‌మ‌ణ‌మ్మ‌
  • ఎంపీడీఓ ఆఫీస్‌లో త‌న‌కు కుర్చీ కూడా లేద‌ని ఆవేద‌న‌
  • ఎంపీపీ ప‌ద‌వితో పాటు ఎంపీటీసీ ప‌ద‌వికీ రాజీనామా చేసిన వైనం

ప‌ల్నాడు జిల్లా గుర‌జాల అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలో సోమ‌వారం అధికార పార్టీ వైసీపీకి షాక్ త‌గిలింది. పిడుగురాళ్ల మండ‌ల ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్న వైసీపీ మ‌హిళా ఎంపీటీసీ ర‌మ‌ణ‌మ్మ త‌న ఎంపీపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఎంపీపీ ప‌ద‌వితో పాటు క‌రాల‌పాడు ఎంపీటీసీ ప‌ద‌వికి కూడా ఆమె రాజీనామా చేశారు.

ఎంపీపీగా ఉన్న త‌న‌కు ఎంపీడీఓ కార్యాల‌యంలో క‌నీసం కుర్చీ కూడా లేద‌ని ఆమె ఆరోపించారు. వైసీపీకి చెందిన మండ‌ల స్థాయి నేత వెంక‌టేశ్వ‌ర రెడ్డి అన‌ధికారిక ఎంపీపీగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ప‌ల్నాడు జిల్లా జిల్లా ప‌రిష‌త్ సీఈఓ శ్రీనివాస‌రెడ్డికి అంద‌జేశారు.

YSRCP
Gurajala
Piduguralla
Palnadu District
Piduguralla MPP
  • Loading...

More Telugu News