T Hub: టి-హబ్ పై కేటీఆర్ ట్వీట్... స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda reacts to KTR tweet on T Hub

  • టి-హబ్ కు నూతన భవన సముదాయం
  • ఈ నెల 28న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • ఆవిష్కరణల రంగానికి ఊతమిస్తుందన్న కేటీఆర్
  • గొప్ప చర్య అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

తెలంగాణ ఆవిష్కరణల కేంద్రం టి-హబ్ కొత్త భవనాల నుంచి కార్యకలాపాలు షురూ చేయనుందని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 28న టి-హబ్ నూతన భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఆవిష్కరణల రంగానికి ఇది విశేషరీతిలో ఊతమిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తును ఊహించడానికి అత్యుత్తమ మార్గం ఆ భవిష్యత్తును సృష్టించడమేనన్న అబ్రహాం లింకన్ మాటలను కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు. 

కాగా, కేటీఆర్ ట్వీట్ పై యువ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. మెరుగైన భవిష్యత్ కోసం ఇది గొప్ప చర్య అని కొనియాడారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఎన్నో ఉద్యోగాలు కల్పించేందుకు వీలుపడుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు. నానాటికీ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి హర్షణీయమని పేర్కొన్నారు.

T Hub
KTR
KCR
Vijay Devarakonda
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News