Vishnu Vardhan Reddy: బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి 

Vishnu Vardhan Reddy opines on Atamkur by election polling trends
  • ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి విజయం
  • రెండోస్థానంలో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్
  • స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి
  • గతంతో పోల్చితే ఓటింగ్ శాతం పెరిగిందని వెల్లడి
ఆత్మకూరులో తమ అభ్యర్థి భరత్ కుమార్ ఓటమిపాలైనప్పటికీ, బీజేపీకి పోలైన ఓటింగ్ శాతం పట్ల రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో బీజేపీకి 2,314 ఓట్లు పోలయ్యాయని, 1.33 శాతం ప్రజలు తమకు మద్దతు పలికారని విష్ణు వివరించారు. 2022కి వచ్చేసరికి బీజేపీకి 19,332 ఓట్లు పడ్డాయని, తమకు మద్దతు పలికిన ప్రజల సంఖ్య 14.1 శాతానికి పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 

ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఓటింగ్ శాతం పెరుగుదలే నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భవిష్యత్తులోనూ మరింత మెరుగ్గా పనిచేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Vishnu Vardhan Reddy
Atmakur
By Polls
Voting
BJP

More Telugu News