Sai Kiran: అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్

Actor Sai Kiran approaches police

  • నిర్మాతలు జాన్ బాబు, లివింగ్ స్టన్ లపై ఫిర్యాదు
  • తన నుంచి రూ.10.6 లక్షలు అప్పు తీసుకున్నారని వెల్లడి
  • మోసం చేశారని ఆరోపణ
  • కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు


ప్రముఖ నటుడు, గాయకుడు సాయికిరణ్ నిర్మాతలు జాన్ బాబు, లివింగ్ స్టన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన వద్ద రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకున్నారని, తిరిగి తీర్చాలని అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయికిరణ్ ఆరోపించారు. సాయికిరణ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయకుడు సాయికిరణ్ 'నువ్వే కావాలి' చిత్రంతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ప్రేమించు' చిత్రంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.

Sai Kiran
Police
Debt
Complaint
Tollywood
  • Loading...

More Telugu News