Ayyanna Patrudu: దమ్ముంటే నేరుగా నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం: విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు సవాల్

Ayyanna Patrudu challenges Vijayasaireddy
  • అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత
  • వైసీపీ నేతలు కక్షసాధిస్తున్నారన్న టీడీపీ
  • రాష్ట్ర యంత్రాంగమంతా నర్సీపట్నంలోనే ఉందన్న అయ్యన్న
ఇటీవల నర్సీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అయ్యన్న ట్విట్టర్ లో స్పందించారు. 

తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందని అన్నారు. జేసీబీలు, ఐపీఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు తీసుకువచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 'అంత భయం ఎందుకు సాయిరెడ్డీ...? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం' అంటూ అయ్యన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.
Ayyanna Patrudu
Vijayasai Reddy
Narsipatnam
TDP
YSRCP

More Telugu News