Narasingha Mishra: ద్రౌపది ముర్మును ప్రశంసిస్తూనే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు ఓటు వేయబోనన్న కాంగ్రెస్ నేత

Odisha Congress leader Narasingha Mishra says he dont vote to Draupadi Murmu

  • ద్రౌపది ముర్ము మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళన్న నరసింగ మిశ్రా 
  • శాసనసభలో ఆమెతో కలిసి ఐదేళ్లు పనిచేశానని గుర్తు చేసుకున్న వైనం
  • శరద్ పవార్‌కే తన ఓటని స్పష్టీకరణ

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రశంసలు కురిపించిన ఒడిశా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత నరసింగ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ము మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ అని కొనియాడారు. మంచి వక్త అని, ఆమెతో కలిసి ఐదేళ్లపాటు శాసనసభలో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. 

బీజేపీ, ఆరెస్సెస్ విధానాలకు ద్రౌపది ప్రాధాన్యం ఇస్తారని నరసింగ అన్నారు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు ఓటు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తన ఓటని మిశ్రా స్పష్టం చేశారు.

Narasingha Mishra
Odisha
Draupadi Murmu
Yashwant Sinha
  • Loading...

More Telugu News