President Of India Election: ఆ అవ‌కాశం ఏపీ నుంచి ఒక్క సీఎం ర‌మేశ్‌కు మాత్ర‌మే!

bjp mp cm ramesh got the chance to propose draupadi murmu nomination

  • రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము
  • రేపు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్న ముర్ము
  • ముర్మును ప్ర‌తిపాదించే వారి జాబితాలో సీఎం ర‌మేశ్
  • ఏపీ నుంచి ఆ అవ‌కాశం ద‌క్కిన నేత ఆయ‌నొక్క‌రేన‌ట‌

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో భాగంగా అధికార ప‌క్షం ఎన్డీఏ త‌ర‌ఫున ఒడిశాకు చెందిన మ‌హిళా నేత ద్రౌప‌ది ముర్ము పోటీకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న ముర్ము రేపు (శుక్ర‌వారం) త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. రాష్ట్రప‌తి అభ్యర్థిగా పోటీ చేయాల‌నుకునే అభ్యర్థుల‌ను రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఓటు హ‌క్కు క‌లిగిన 50 మంది ప్ర‌తిపాదిస్తే... మ‌రో 50 మంది బ‌ల‌ప‌ర‌చాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ముర్ము నామినేష‌న్‌కు బీజేపీ ఇప్ప‌టికే స‌న్నాహాలు పూర్తి చేసింది.

ఈ స‌న్నాహాల్లో భాగంగా ద్రౌప‌ది ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌కు కూడా ద‌క్కింది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదిస్తూ గురువార‌మే సీఎం ర‌మేశ్ ప్ర‌తిపాద‌న ప‌త్రంపై సంత‌కం చేశారు. ఇలా ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదించే అవ‌కాశం ద‌క్కిన నేత‌ల్లో ఏపీ నుంచి సీఎం ర‌మేశ్ ఒక్క‌రే ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం ర‌మేశ్ తెలిపారు. ముర్మును ప్ర‌తిపాదిస్తూ సంత‌కం చేస్తున్న ఫొటోల‌ను కూడా ఆయ‌న షేర్ చేశారు.

President Of India Election
Draupadi Murmu
BJP
CM Ramesh
Rajya Sabha
Andhra Pradesh
  • Loading...

More Telugu News