Anand Mahindra: టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని ఎత్తుకెళుతుందేమోనని నా భయం!: కేటీఆర్ ను ఉద్దేశించి ఆనంద్ మహీంద్రా చమత్కారం

Funny conversation between KTR and Anand Mahindra

  • మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కేటీఆర్
  • మహీంద్రాకు ప్రచారం కల్పిస్తున్నానంటూ కేటీఆర్
  • మీరు తిరుగులేని అంబాసిడర్ అంటూ ఆనంద్ స్పందన
  • అదే రీతిలో ఫన్నీగా బదులిచ్చిన కేటీఆర్

ఇవాళ జహీరాబాద్ లో మహీంద్రా సంస్థ 3,00,001వ ట్రాక్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ పై కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆనంద్ మహీంద్రా గారూ చూడండి... మీ ట్రాక్టర్లకు ఎలా ప్రచారం కల్పిస్తున్నానో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. 

"మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్... అందులో ఎలాంటి సందేహంలేదు. అయితే ఆకాశాన్నంటుతున్న టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం" అంటూ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ వెంటనే బదులిచ్చారు. "సర్... మిమ్మల్ని లాగేవాళ్లెవరూ ఇంకా దొరకలేదా..!"  అంటూ చమత్కరించారు.

Anand Mahindra
KTR
Tractor
Ambassador
Telangana
  • Loading...

More Telugu News