Ayyanna Patrudu: దీక్షకు దిగిన అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్

Ayyanna Patrudu son Vijay deeksha

  • అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన అధికారులు  
  • ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ
  • టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన ఘటనపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి టీడీపీ శ్రేణలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ దీక్షకు దిగారు. తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. మరోవైపు చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంకు వెళ్లకుండా తణుకులో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు.

Ayyanna Patrudu
Son Vijay
Protest
  • Loading...

More Telugu News