Kamal Haasan: బాహుబలి-2 రికార్డును అధిగమించిన కమలహాసన్ 'విక్రమ్'

Kamal Haasan starred Vikram movie surpassed Bahubali 2 record
  • ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విక్రమ్'
  • కమల్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రం
  • వరల్డ్ వైడ్ రూ.300 కోట్లు రాబట్టిన విక్రమ్
  • తమిళనాడులో రెండు వారాల్లో రూ.150 కోట్లు
  • తమిళనాట రూ.146 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2
కమలహాసన్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.300 కోట్లు రాబట్టిన ఈ చిత్రం తమిళనాడులో బాహుబలి-2 రికార్డును కూడా అధిగమించింది. విక్రమ్ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ.150 కోట్లు వసూలు చేసింది. 2017లో వచ్చిన బాహుబలి-2 చిత్రం తమిళనాడులో రూ.146 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డును కమల్ కొత్త సినిమా బద్దలు కొట్టింది. 

కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్రనటులు నటించిన విక్రమ్ చిత్రం తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రముఖ హీరో సూర్య 'రోలెక్స్' అనే గెస్ట్ రోల్ లో కాసేపు కనువిందు చేశాడు. సూర్య కనిపించేది ఐదు నిమిషాలే అయినా థియేటర్లో విజిల్స్ మోగేలా అతడి పాత్ర ఉందని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Kamal Haasan
Vikram
Bahubali-2
Tamilnadu Record
Lokesh Kanagaraj
Kollywood

More Telugu News