Prime Minister: యోగాను ఆచరించాలంటూ ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం

PM Modi urges to practice yoga for health and wellness

  • యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రధాని
  • పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులకు పరిష్కారమని సూచన
  • చిన్న ప్రదేశంలోనే సులభంగా చేసుకోవచ్చంటూ సందేశం

నేటి రోజుల్లో యోగాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రధాని మోదీ తెలియజేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశం ఇచ్చారు. అంటు వ్యాధులు కానివి (గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర), జీవన శైలి వ్యాధులు నేడు పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగినట్టు ప్రధాని పేర్కొన్నారు.  

ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. యోగాకు సంబంధించి వీడియోను షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. జూన్ 21న మైసూరులో జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని ప్రధాని వివరించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. 

‘‘యోగాలో అందం ఏమిటంటే సులభంగా చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఒక చాప, కొంచెం స్థలం ఉంటే చాలు. యోగాను ఇంట్లోనే చేసుకోవచ్చు. పనిలో విరామం సమయంలోనూ చేసుకోవచ్చు’’అని ప్రధాని మోదీ సూచించారు.

Prime Minister
Narendra Modi
international yoga day
message
yoga
  • Loading...

More Telugu News