Nara Lokesh: అనంతబాబుకే బాబులా తయారయ్యాడు వైసీపీ నేత విక్టర్ బాబు: నారా లోకేశ్

Nara Lokesh alleges YCP leader Victor Babu cheating tribal people

  • అల్లూరి జిల్లాలో వైసీపీ నేత మోసాలు అంటూ లోకేశ్ ట్వీట్
  • ప్రభుత్వ ఉద్యోగాలంటూ లక్షలు వసూలుచేశాడని ఆరోపణ
  • గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైసీపీ నేత విక్టర్ బాబు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గిరిజనుల నుంచి లక్షలు వసూలు చేశాడని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఆరోపించారు. విక్టర్ బాబు... అనంతబాబుకే బాబులా తయారయ్యాడని విమర్శించారు. 

అనంతబాబు అండతో ఏజెన్సీ ప్రాంతాల్లో విక్టర్ బాబు అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గిరిజనులు అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్టర్ బాబు విలాసాలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత విక్టర్ బాబు దోపిడీపై దర్యాప్తు చేయాలని, గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Nara Lokesh
Victor Babu
Cheating
Tribal
Anantha Babu
  • Loading...

More Telugu News