Balakrishna: సంక్రాంతి బరిలోకి బాలయ్య దిగడం ఖాయమైపోయినట్టే!

Balakrishna upcoming movies update
  • సెట్స్ పై బాలకృష్ణ 107వ సినిమా
  • దసరాకి విడుదల చేసే ఆలోచన 
  • 108వ సినిమా అనిల్ రావిపూడితో
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్    
బాలకృష్ణకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఎందుకంటే సంక్రాంతి బరిలోకి దిగిన ఆయన సినిమాలన్నీ చాలావరకూ హిట్ అయ్యాయి. అందువలన ఏ మాత్రం అవకాశం ఉన్నప్పటికీ తన సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటారు. ఆయన 108వ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగడం దాదాపు ఖరారైందని అంటున్నారు.

బాలకృష్ణ 108వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జులైలో మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని అనిల్ రావిపూడి చెప్పాడు. కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని అన్నాడు. కథానాయికలుగా ప్రియమణి - మెహ్రీన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య  తన 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Balakrishna
Sreeleela
Anil Ravipudi Movie

More Telugu News