Congress: హుస్సేన్ సాగ‌ర్ తీరాన కాంగ్రెస్ హోరు... రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న‌

tpcc conducta huge rally threw hussain sagar over ed enquiry on rahul gandhi

  • ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన రాహుల్ గాంధీ
  • ఈడీ తీరును నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు
  • హుస్సేన్ సాగ‌ర్ మీదుగా టీపీసీసీ ర్యాలీ
  • ర్యాలీలో జ‌న వాహిని అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారిస్తున్న అంశాన్ని నిర‌సిస్తూ, న‌రేంద్ర మోదీ స‌ర్కారు ద‌మన నీతితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌ను హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ఈడీ కార్యాల‌యాల ఎదుట పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఆందోళ‌న చేప‌డుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో టీపీసీసీ చేప‌ట్టిన నిర‌స‌న‌కు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఈ ర్యాలీలో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వ‌హించాయి. ఈ ర్యాలీ హుస్సేన్ సాగ‌ర్ మీదుగా సాగ‌గా... ఆ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ శ్రేణుల‌తో నిండిపోయింది. అక్క‌డ ఓ జ‌న‌సంద్ర‌మే క‌నిపించింది. ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ రేవంత్ రెడ్డి... ర్యాలీ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ దానికి 'సాగ‌ర తీరాన జ‌న వాహిని... ప్ర‌తిధ్వ‌ని' అంటూ ఓ కామెంట్ జ‌త చేశారు. అంతేకాకుండా స‌త్య‌మేవ జ‌య‌తే అన్న క్యాప్ష‌న్‌ను కూడా త‌న ట్వీట్‌కు ఆయ‌న జ‌త చేశారు.

Congress
Rahul Gandhi
Revanth Reddy
TPCC President
TPCC
Hussain sagar
Telangana
Hyderabad
Enforcement Directorate
  • Loading...

More Telugu News