Faisal Wani: నుపుర్ శర్మ తల నరుకుతున్నట్టుగా వీడియో... కశ్మీర్ యూట్యూబర్ అరెస్ట్

Police arrests youtuber Faisal Wani

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ
  • నుపుర్ ను సస్పెండ్ చేసిన బీజేపీ
  • వైరల్ గా మారిన ఫైజల్ వనీ వీడియో
  • తీవ్రంగా పరిగణించిన పోలీసులు

ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో నుపుర్ శర్మ తీవ్ర చర్చనీయాంశంగా మారారు. నుపుర్ ను బీజేపీ వర్గాలు సస్పెండ్ చేసినప్పటికీ ఆమెపై ఆగ్రహావేశాలు చల్లారడంలేదు. ఈ క్రమంలో కశ్మీర్ కు చెందిన ఫైజల్ వనీ అనే యూట్యూబర్ పోస్టు చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. వనీ ఓ ఆయుధం చేతబట్టి నుపుర్ తల నరుకుతున్నట్టుగా ఆ వీడియోలో ఓ గ్రాఫిక్స్ సీన్ ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దీన్ని తీవ్రంగా పరిగణించిన సఫా కడాయ్ పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్ట్ చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాడని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ప్రచారం చేస్తున్నాడన్న అభియోగాలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 505, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

కాగా, తన వీడియోపై తీవ్ర దుమారం రేగడంతో వనీ ఆ వీడియోను తొలగించాడు. తన అరెస్ట్ కు ముందు మరో వీడియో పోస్టు చేసి క్షమాపణలు కోరాడు. ఏ మతానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశాడు.
.

Faisal Wani
Youtuber
Arrest
Police
Nupur Sharma
  • Loading...

More Telugu News