Janasena: అక్టోబ‌ర్ 5 నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌.. నాదెండ్ల మనోహర్ ప్రకటన

  • తిరుప‌తి నుంచే ప‌వ‌న్ బ‌స్సు యాత్రన్న నాదెండ్ల 
  • 2023లోనే ఎన్నిక‌లు రానున్నాయంటూ వ్యాఖ్య 
  • ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాలని ‌శ్రేణులకు పిలుపు 
nadendla manohar statement on pawan kalyan bus yatra

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యా‌ణ్ ఏపీలో బ‌స్సు యాత్ర‌కు రంగం సిద్ధ‌మైంది. అక్టోబ‌ర్ 5 నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర ప్రారంభం కానుంద‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటి (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో శుక్ర‌వారం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు క్రియాశీల స‌భ్య‌త్వం కిట్ల‌ను పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా నాదెండ్ల ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప‌వ‌న్ బస్సు యాత్ర సాగుతుంద‌ని నాదెండ్ల ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 5న తిరుప‌తి నుంచి ప‌వ‌న్ త‌న బ‌స్సు యాత్ర‌ను ప్రారంభిస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భ‌గా 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా నాదెండ్ల కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికలు 2023లోనే జ‌ర‌గబోతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలో పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

More Telugu News