Realme Narzo 50 Pro 5G: రియల్ మీ నార్జో 50 ప్రో అమ్మకాలు నేటి నుంచే.. రూ.2,000 డిస్కౌంట్

Realme Narzo 50 Pro 5G first sale kicks off today with Rs 2000 discount offer

  • రెండు వేరియంట్లతో అందుబాటులోకి
  • 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999
  • 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.23,999
  • అమెజాన్, రియల్ మీ పోర్టళ్లపై లభ్యం

రియల్ మీ నార్జో 50 ప్రో 5జీ మొదటిసారి విక్రయాలు శుక్రవారం మొదలయ్యాయి. 6జీబీ ర్యామ్ ధర రూ.21,999. ఇక 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.23,999. హెచ్ డీఎఫ్ సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రియల్ మీ వెబ్ సైట్, అమెజాన్ పోర్టల్ పై కొనుగోలు చేసుకోవచ్చు. 

నార్జో 50సిరీస్ లో ఇదే ఖరీదైన ఫోన్. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 90హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. మీడియాటెక్ డైమిన్సిటీ 920 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ర్యామ్ ను పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. వెనుక భాగంలో 48 మెగా పిక్సల్, అల్ట్రావైడ్ సెన్సార్, మ్యాక్సో సెన్సార్ ఇలా మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. పంచ్ హోల్ తో డిస్ ప్లే ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీకి 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది.

Realme Narzo 50 Pro 5G
Rs 2000 discount offer
realme
5g phone
  • Loading...

More Telugu News