Mahima Chaudhry: మహిమా చౌదరికి బ్రెస్ట్ కేన్సర్: ప్రకటించిన అనుపమ్ ఖేర్

Mahima Chaudhry is diagnosed with breast cancer Anupam Kher shares video with her

  • ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్.. వీడియో షేరింగ్
  • సాధారణ చెకప్ లలో బయటపడిందన్న మహిమ
  • ఎటువంటి లక్షణాలు లేవని ప్రకటన

బాలీవుడ్ నటి మహిమా చౌదరి కేన్సర్ బారిన పడ్డారు. మహిమా చౌదరి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నట్టు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించి ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. మహిమాను ఒక హీరోగా ఆయన అభివర్ణించారు. ‘‘అభిమానులకు ఈ విషయాన్ని నేనే చెప్పాలని ఆమె ఆశించారు’’ అని అనుపమ్ ఖేర్ తెలిపారు.

మహిమా చౌదరి ధైర్యం, కేన్సర్ కు సంబంధించిన కథనం అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘నా 252వ చిత్రం ‘ద సిగ్నేచర్’లో కీలక పాత్ర పోషించే విషయమై నేను నెల క్రితం అమెరికా నుంచి మహిమా చౌదరికి కాల్ చేశాను. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ ఉందని నాటి సంభాషణతో తెలిసింది. ఆమె వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు ఆశను కల్పిస్తుంది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అని అనుపమ్ ఖేర్ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. స్నేహితులారా ఆమెకు మీ ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు అందించండని కోరారు. (వీడియో కోసం)

‘‘తన సినిమాలో నటించాలని అనుపమ్ నాకు కాల్ చేశారు. ఆ సమయలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. వెబ్ షోలు, సినిమాల్లో నటించాలంటూ నాకు ఎన్నోకాల్స్ వస్తున్నాయి. కానీ నేను యస్ అని చెప్పలేను. ఎందుకంటే నాకు శిరోజాలు లేవు’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు కేన్సర్ లక్షణాలు ఏవీ లేవని, సాధారణ చెకప్ ల్లో అది బయటపడినట్టు ఆమె చెప్పారు.

Mahima Chaudhry
breast cancer
Anupam Kher
revealed
Instagram
  • Loading...

More Telugu News