Islam: ఇస్లాంను అవమానపరిచాడని.. ఫ్యాషన్ మోడల్‌ను అరెస్ట్ చేసిన తాలిబన్లు

Taliban arrest Afghan fashion model

  • హకీకీ, అతడి ముగ్గురు సహచరులను అరెస్ట్ చేసిన తాలిబన్లు
  • చేతికి సంకెళ్లతో ఉన్న హకీకీ వీడియోను విడుదల చేసిన తాలిబన్లు
  • వారిని వెంటనే విడుదల చేయాలన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

ఇస్లాంను, ఖురాన్‌ను అవమానించాడంటూ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ప్రముఖ మోడల్, అతని సహచరులు ముగ్గురిని తాలిబన్లు అరెస్ట్ చేశారు. ఫ్యాషన్ షోలు, యూట్యూబ్ క్లిప్‌లు, మోడలింగ్ ఈవెంట్ల ద్వారా ప్రసిద్ధి చెందిన అజ్మల్ హకీకీని మంగళవారం తాలిబన్లు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తాలిబన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో అజ్మల్ చేతికి సంకెళ్లతో కనిపించాడు. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో హకీకి సహోద్యోగి అయిన గులాం సఖీ తన ప్రసంగంలో ఖురాన్ సూక్తులను హాస్య స్వరంతో పఠిస్తుండగా, హకీకీ నవ్వుతూ కనిపించాడు. అరెస్ట్ తర్వాత హకీకీ, అతడి సహచరులు లేత గోధుమరంగు జైలు యూనిఫాంలో నిలబడి తాలిబన్ ప్రభుత్వానికి, మత పెద్దలకు క్షమాపణలు చెబుతున్న వీడియోను తాలిబన్లు విడుదల చేశారు.

ఈ వీడియోతోపాటు దారి భాషలో ఓ ట్వీట్‌ చేసిన తాలిబన్లు.. మహ్మద్ ప్రవక్త ఖురాన్ సూక్తులను అవమానించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, అరెస్ట్ చేసిన హకీకీ, అతడి సహచరులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలిబన్లను కోరింది.

Islam
Afghanistan
Taliban
Fashion Model
  • Loading...

More Telugu News