cooperative banks: కోఆపరేటివ్ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ

Additional measures announced by the RBI Regulatory measures for cooperative banks

  • వ్యక్తిగత గృహ రుణాల పరిమితి నూరు శాతం పెంపు
  • పెరిగిన మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ
  • వాణిజ్య రియల్ ఎస్టేట్ రుణాలకు అనుమతి

ఆర్బీఐ తన తాజా సమీక్షలో పట్టణ కోఆపరేటివ్ బ్యాంకులు, గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకులకు అనుకూలించే పలు నిర్ణయాలను తీసుకుంది. వ్యక్తిగత గృహ రుణాల విభాగంలో రుణ పరిమితిని నూరు శాతం పెంచింది. గత పదేళ్ల కాలంలో పెరిగిన మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల మరింత మొత్తంలో రుణాలను మంజూరు చేసేందుకు వీలు కల్పించింది.

రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు సైతం ఇప్పుడు వాణిజ్య రియల్ ఎస్టేట్ రుణాలు ఇవ్వొచ్చు. రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులకు సైతం రుణాలు మంజూరు చేసుకోవచ్చు. కాకపోతే వాటి మొత్తం రుణ ఆస్తుల్లో ఇలా ఇచ్చే రుణాలు 5 శాతం దాటకూడదు. పట్టణ కోఆపరేటివ్ బ్యాంకులు తమ కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి బ్యాంకింగ్ సేవలు (డోర్ స్టెప్) అందించొచ్చు.

  • Loading...

More Telugu News