TDP: వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం టీడీపీ రైతు ర‌థమే: అయ్య‌న్న‌పాత్రుడు

  • గ‌తంలో రైతు ర‌థం పేరుతో చంద్ర‌బాబు హయాంలో ప‌థ‌కం
  • దానినే వైఎస్సార్ వాహ‌న మిత్రగా ప్రారంభించార‌న్న అయ్య‌న్న‌
  • ఈ త‌ర‌హా విద్యలో వైసీపీ నేత‌లు ఆరితేరిపోయార‌ని వ్యాఖ్య‌
ayyannapatrudu satires on ysr vahana mithra

టీడీపీ హ‌యాంలో చంద్ర‌బాబు ప్రారంభించిన రైతు ర‌థం ప‌థ‌కాన్నే ఇప్పుడు పేరు మార్చి వైఎస్సార్ వాహ‌న మిత్ర పేరిట ప్రారంభించార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌ అయ్య‌న్న‌పాత్రుడు ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అయ్య‌న్న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

చంద్ర‌బాబు అమ‌లు చేసిన ప‌థ‌కాన్ని ముందుగా ఆపేయడం, ఆ త‌ర్వాత రెండు, మూడేళ్ల‌కు అదే ప‌థ‌కానికి కొత్త పేరు పెట్టి ప్రారంభించ‌డం వైసీపీ ప్ర‌భుత్వానికి అలవాటుగా మారింద‌ని స‌ద‌రు ట్వీట్‌లో అయ్య‌న్న ఆరోపించారు. అలాంటి ప‌థ‌కాల‌ను ప్రపంచంలో‌నే తొలిసారి తానే తెచ్చాన‌ని చెప్పుకుంటున్న సీఎం జ‌గ‌న్‌... ఎవ‌రికో పుట్టిన బిడ్డ‌ను త‌న బిడ్డ అని చెప్పుకుంటున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి వ్య‌వ‌హారాల్లో వైసీపీ నేత‌లు ఆరితేరిపోయార‌ని కూడా అయ్య‌న్న విమర్శించారు. 

More Telugu News