Varla Ramaiah: నేర చరిత్ర ఉన్న అనంతబాబుకు జైల్లో సకల సదుపాయాలు లభిస్తున్నాయి: వర్ల రామయ్య

Varla Ramaiah writes letter to Anantha Babu

  • మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
  • వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలన్న వర్ల
  • జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం నిజమా, కాదా అని ప్రశ్న

తన మాజీ డ్రైవర్ ను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు లభిస్తున్నాయని డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అనంతబాబుకు పెద్ద నేర చరిత్ర ఉందని చెప్పారు. నేర చరిత్ర ఉన్న అనంతబాబుకు జైల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలియడం బాధాకరంగా ఉందని అన్నారు. జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Varla Ramaiah
Telugudesam
Anantha Babu
YSRCP
AP DGP
Letter
  • Loading...

More Telugu News