WhatsApp: వాట్సాప్ పై మరో కొత్త ఫీచర్

WhatsApp may soon bring an undo button for deleted messages

  • అన్ డూ ఆప్షన్ అభివృద్ధి
  • డిలీట్ చేసిన సందేశాలను రిట్రీవ్ చేసుకోవచ్చు 
  • పొరపాటుగా డిలీట్ చేసినట్టయితే బెనిఫిట్

వాట్సాప్ ఎప్పటికప్పుడు పరిశోధన ద్వారా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. తాజాగా ఈ సంస్థ ‘అన్ డూ’ ఆప్షన్ పై పనిచేస్తోంది. మనం ఎవరో ఒకరికి మెస్సేజ్ చేసిన తర్వాత వాటిని వద్దనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. ఒక అరగంటలోపు వీటిని డిలీట్ కొట్టేయవచ్చు. గ్రూపులో పెట్టిన మెస్సేజ్ లో ఏదైనా తప్పును గుర్తిస్తే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో డిలీట్ ఫీచర్ కు సంబంధించి ఎన్నో ప్రశంసలు లభించాయి.

ఈ ఉత్సాహంతో వాట్సాప్ ఇప్పుడు మరో ఫీచర్ తీసుకురాడంపై దృష్టి సారించింది. ఒకవేళ ఏదైనా మెస్సేజ్ ను పొరపాటుగా డిలీట్ కొడితే ఎలా..? ఇందుకోసమే అన్ డూ ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్టు ‘వాటాబీటా ఇన్ఫో’ సంస్థ ప్రకటించింది. ఈ ఆప్షన్ తో డిలీట్ చేసిన సందేశాలన్నింటినీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఈ నూతన సదుపాయం ప్రయోగాత్మక దశలో ఉంది. ఇది కొందరు యూజర్లకే అందుబాటులో ఉండగా, పరీక్షల తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది.

WhatsApp
New feature
undo
testing
  • Loading...

More Telugu News