Vellampalli Srinivasa Rao: చిరంజీవిని నాగబాబు అవమానించారు: వెల్లంపల్లి శ్రీనివాస్

Nagababu insulted Chiranjeevi says Vellampalli Srinivas

  • మెగాస్టార్ లేకపోతే పవర్ స్టార్ లేరన్న వెల్లంపల్లి 
  • జనసేనకు చిరంజీవి అభిమానులు సపోర్ట్ చేయాలని నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణ 
  • పవన్ ను బీజేపీ వాళ్లు పట్టించుకోవడం లేదని ఎద్దేవా 

జనసేన నేత, సినీ నటుడు నాగబాబుపై ఏపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని ఆయన అన్నారు. చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ ఎవరికి తెలిసేవాడని ప్రశ్నించారు. మెగాస్టార్ లేకపోతే పవర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చేవాడని అన్నారు.

ఇక నాగబాబుకు ఒక విధి, విధానం అంటూ లేవని విమర్శించారు. చిరంజీవి అభిమానులను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనకు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలని నాగబాబు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా పవన్ ఎలాంటి వాడో తెలుసని చెప్పారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుంటూ బీజేపీతో పవన్ టచ్ లో ఉన్నారని విమర్శించారు. పవన్ ను బీజేపీ వాళ్లు పట్టించుకోవడం లేదని వెల్లంపల్లి అన్నారు.

Vellampalli Srinivasa Rao
YSRCP
Pawan Kalyan
Nagababu
Janasena
Chiranjeevi
Tollywood
  • Loading...

More Telugu News