District Collector: తన కొడుకును సామాన్యుడిలా అంగన్వాడీ బడిలో చేర్పించిన కర్నూలు కలెక్టర్.. ఇదిగో వీడియో

Collector Admits His Son In Anganwadi Center

  • ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ కోటేశ్వరరావు
  • దివి అర్విన్ కు నిన్న అంగన్వాడీలో అడ్మిషన్
  • తన బంగళాకు సమీపంలోనే స్కూలు

ఆయనో కలెక్టర్. అయితేనేం తన కుమారుడిని ఓ సామాన్యుడిలా అంగన్వాడీ బడిలో చేర్పించారు. కర్నూల్ జిల్లా కలెక్టర్ అయిన పి. కోటేశ్వరరావు.. తన నాలుగేళ్ల కుమారుడు దివి అర్విన్ ను బుధవారపేటలోని తన బంగళాకు సమీపంలో ఉండే అంగన్వాడీ కేంద్రంలో నిన్న చేర్పించారు. 

సామాన్యుడి తరహాలో అంగన్వాడీలో తన కుమారుడిని చేర్పించి ఆయన ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆయన్ను అందరూ అభినందిస్తున్నారు. ఇక, అందరు పిల్లల్లాగనే దివి అర్విన్ కు అంగన్వాడీ టీచర్లు పాఠాలు చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

District Collector
Kurnool District
Andhra Pradesh
Anganwadi
  • Loading...

More Telugu News