Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న మాటల యుద్ధం.. సోము వీర్రాజుకు అంబటి రాంబాబు కౌంటర్!

Ambati Rambabu gives counter to Somu Veerraju

  • కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారన్న అంబటి 
  • ఈ విషయం తెలుసుకోవడానికి మూడేళ్లు పట్టిందా అంటూ వీర్రాజు ఎద్దేవా
  • మీకు ముడుపులు అందితే చాలు కదా అని విమర్శ

ఆంధ్రుల జీవనాడి పోలవడం ప్రాజెక్టుపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారంటూ ఏపీ జలవనరులశాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ ఈ విషయం తెలుసుకోవడానికి మీకు మూడు సంవత్సరాలు పట్టిందా? అని ఎద్దేవా చేశారు. మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లు ఉంటే చాలు, మీకు ముడుపులు అందితే చాలు... అదే కదా టీడీపీ, వైసీపీ ఆలోచనా విధానమని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ గారి పర్యటన తర్వాత ఈ తప్పులన్నీ బయటకు వస్తున్నాయని చెప్పారు. 

సోము వీర్రాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వమే కాదు, కేంద్ర జలశక్తి అడ్వైజర్ శ్రీరామ్ నాయకత్వంలో డయాఫ్రమ్ వాల్ పరిశీలించి వెళ్లిన కేంద్ర కమిటీ కూడా పరిస్థితిని నిర్ధారించలేకపోతోందని, ఈ విషయం కాస్త తెలుసుకోండని సెటైర్ వేశారు.

Ambati Rambabu
YSRCP
Somu Veerraju
BJP
Polavaram Project
  • Loading...

More Telugu News