Nagababu: త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తాం: నాగబాబు

Janasena leader Nagababu said Janasena party high command will appoint constituency in charges soon

  • జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన
  • పార్టీ శ్రేణులతో సమావేశాలు
  • పొత్తులపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
  • సంక్షేమ పాలన అంటూ దోపిడీ చేస్తున్నారని విమర్శలు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరలో చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తామని తెలిపారు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై పవన్ కల్యాణ్ దే తుది నిర్ణయం అని నాగబాబు స్పష్టం చేశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారని, పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పాలన పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

Nagababu
Incharge
Constituency
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News