Deepak Chahar: వివాహంతో ఓ ఇంటి వాడైన దీపక్ చాహర్

India star Deepak Chahar marries fiance Jaya Bhardwaj pens romantic message on social media
  • ప్రేయసి జయ భరద్వాజ్ చిటికెన వేలును పట్టిన చాహర్
  • ఆగ్రాలో ఘనంగా వివాహ వేడుక
  • ఇన్ స్టా గ్రామ్ లో ఫోటో షేర్ చేసిన చెన్నై క్రికెటర్
  • దీవించాలని కోరుతూ పోస్ట్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రేయసి జయ భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో బుధవారం వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను దీపక్ చాహర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. 

‘‘నేను మొదటిసారి నిన్ను కలుసుకున్నప్పుడు నాకు నీవే సరైనదానివి అని భావించాను. మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం. నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతానని ప్రామిస్ చేశాను. జీవితంలో ఒకానొక అద్భుత క్షణం. ప్రతి ఒక్కరూ మాకు మీ దీవెనలు అందించాలి’’ అని చాహర్ పోస్ట్ పెట్టాడు. 

ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ స్టాండ్స్ లో కూర్చున్న ప్రియురాలు జయ భరద్వాజ్ కు దీపక్ చాహర్ ప్రేమను వ్యక్తం చేయడం, ఆ వీడియోను అతడు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడం తెలిసిందే. రూ.14 కోట్లతో చాహర్ ను చెన్నై జట్టు కొనుగోలు చేసినప్పటికీ గాయాల కారణంగా అతడు 2022 సీజన్ కు అందుబాటులో లేకపోవడం తెలిసిందే.
Deepak Chahar
married
Jaya Bhardwaj
agra
csk bowler

More Telugu News