Pawan Kalyan: సామాజిక న్యాయం కోసం... లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan appreciates Lakshman on his Rajya Sabha chance

  • డాక్టర్ కె.లక్ష్మణ్ కు రాజ్యసభ చాన్స్
  • నేడు లక్నోలో నామినేషన్ల దాఖలు
  • యూపీ నుంచి రాజ్యసభకు పోటీ
  • అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కు పార్టీ హైకమాండ్ రాజ్యసభ అవకాశం ఇచ్చింది. మలి విడత జాబితాలో ఆయన పేరు చేర్చింది. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళుతున్న సీనియర్ నేత, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి తన తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

విద్యార్థి దశ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన లక్ష్మణ్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు ఆయను మరింత ముందుకు తీసుకెళ్లాయని వివరించారు. సామాజిక న్యాయం మాటలకు, రాజకీయ అవసరాలకు పరిమితం కాకుండా ఉండాలంటే లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలని పవన్ కల్యాణ్ అభిలషించారు. లక్ష్మణ్ గారు ఆ దిశగా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. లక్ష్మణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News