Kid: క్యూట్ వీడియో: తల్లితో కలిసి ఐదు నెలల చిన్నారి పుషప్స్

5 Month Old Plank Position Goes Viral On Instagram

  • పర్ ఫెక్ట్ గా ప్లాంక్ పొజిషన్
  • ఫిదా అయిపోతున్న నెటిజన్లు
  • ఇప్పటిదాకా 31 లక్షల వీక్షణలు

మామూలుగా 5 నెలల పిల్లలు ఏం చేస్తారు? పాలు తాగి బజ్జుంటారు.. ఏడుస్తారు.. ఇల్లంతా అటూఇటూ పాకుతూ సందడి సందడి చేస్తుంటారు. ఇదిగో ఈ చిన్నారి మాత్రం తన తల్లితో కలిసి పుషప్స్ చేస్తున్నాడు. ప్లాంక్ పొజిషన్ లో ఉన్న తన తల్లిని అనుకరిస్తూ అందరినీ మెస్మరైజ్ చేసేస్తున్నాడు. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన ఆ చిన్నారి తల్లి మిషెల్లి వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 

‘నా ఐదు నెలల కుమారుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆ వీడియోను ఇప్పటిదాకా 31 లక్షల మంది దాకా వీక్షించారు. ఐదు నెలల పిల్లాడు ఇంత పర్ ఫెక్ట్ గా ప్లాంక్ పొజిషన్ లో ఉండడమా అంటూ నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఎంత ముద్దుగా చేస్తున్నాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Kid
Plank Position
Instagram
  • Loading...

More Telugu News