TV Actress: ఆత్మహత్యాయత్నం చేసిన తెలుగు బుల్లితెర నటి

  • విషం తాగిన టీవీ నటి మైథిలి
  • గతంలో నగలు పోయాయంటూ ఫిర్యాదు
  • పోలీసులు సరిగా స్పందించలేదని మనస్తాపం
Telugu TV actress attempts suicide

ఓ కేసులో పోలీసులు సరిగా స్పందించలేదంటూ తెలుగు బుల్లితెర నటి మైథిలి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తెలుగు టీవీ నటి మైథిలి ఇటీవల బంగారు నగలు పోయాయని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఆ కేసులో పురోగతి లేకపోవడంతో ఆమె మరోసారి పంజాగుట్ట పీఎస్ కు వెళ్లారు. అయితే, తన కేసు పట్ల పోలీసులు సరిగా స్పందించలేదంటూ మైథిలి మనోవేదనకు గురయ్యారు. దాంతో తన అపార్ట్ మెంట్ కు తిరిగొచ్చి విషం తాగారు. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి టీవీ నటిని నిమ్స్ కు తరలించారు. ఆమె చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. మైథిలి గతంలో పంజాగుట్ట పీఎస్ పరిధిలో నివాసం ఉండేవారు. ప్రస్తుతం అమీర్ పేట సారథి స్టూడియోస్ వెనుక ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు.

More Telugu News