Dastagiri: వైసీపీ నేతలు నన్ను చంపేందుకు యత్నిస్తున్నారు: దస్తగిరి

YSRCP leaders trying to kill me says Dastagiri

  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
  • తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ పై ఆరోపణలు 
  • ఆయన తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నాడన్న దస్తగిరి
  • పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఎస్పీకి ఫిర్యాదు

వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి వైయస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచుగా తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నాడని... ఏదో ఒక విధంగా తనను చంపాలని చూస్తున్నాడని చెప్పారు. 

వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నందున తనను హతం చేయాలనుకుంటున్నారని తెలిపారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు కూడా చెప్పానని అన్నారు.

Dastagiri
YS Vivekananda Reddy
  • Loading...

More Telugu News