Kolkata: కోల్ కతాలో మరో మోడల్ మృతి.. రెండు వారాల్లో ఇది నాలుగో మరణం!

One more model commits suicide in Kolkata

  • 18 ఏళ్ల మోడల్ సరస్వతి ఆత్మహత్య
  • తన నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్
  • మోడల్స్ ఆత్మహత్యలకు ఏదైనా లింక్ ఉందా అనే  కోణంలో పోలీసుల దర్యాప్తు

కోల్ కతాలో మోడల్స్ వరుసగా మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా 18 ఏళ్ల మోడల్ సరస్వతి విగతజీవిగా కనిపించింది. కస్బా ఏరియాలోని తన నివాసంలోని ఒక గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మేకప్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

సరస్వతి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె బామ్మ తొలుత చూశారని, వెజిటబుల్ కటర్ తో తాడును కోసి ఆమె మృతదేహాన్ని కిందకు దింపారని చెప్పారు. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారని వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం తాము వేచి చేస్తున్నామని చెప్పారు. 

రెండు వారాల్లో మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడటం ఇది నాలుగోది. ఈ అంశంపై పోలీసులు మాట్లాడుతూ, ఇంతకు ముందు ఆత్మహత్యకు పాల్పడిన మంజూషా నియోగి, బిదీషా డే మజుందార్, పల్లవి డే ల ఆత్మహత్యలకు, సరస్వతి ఆత్మహత్యకు ఏదైనా లింక్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సరస్వతి మొబైల్ ఫోన్ ను సీజ్ చేశామని... ఫోన్ కాల్స్, సోషల్ మీడియా యాక్టివిటీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Kolkata
Model
Suicide
  • Loading...

More Telugu News